Ukraine Crisis: రష్యాకు భారీ సైనిక నష్టం.. 1500 మంది సైనికాధికారులు మృతి..!
ఉక్రెయిన్ యుద్ధంలో భారీ స్థాయిలో సైనిక నష్టం జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం రష్యా వైపే సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. వీరిలో 1500 మంది ఉన్నతాధికారులు ఉండగా, వారిలో 160 మంది వివిధ స్థాయి సైనిక జనరళ్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా వైపు భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నట్లు చెబుతున్నాయి. ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో 1500 మందికి పైగా రష్యా సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో 160 మందికిపైగా జనరల్ స్థాయి అధికారులున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నివేదికలను బట్టి ఈ అంచనాలు వెలువడుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టానికి సంబంధించి పాశ్చాత్య దేశాలు వేస్తోన్న అంచనాలను రష్యా అంగీకరించడం లేదు. సెప్టెంబర్ వరకు కేవలం 5397 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా పేర్కొంది. అయితే, యుద్ధంలో ఇప్పటివరకు లక్షకు పైగా రష్యా సైనికులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని అమెరికా జనరల్ మార్క్ మిల్లే వెల్లడించారు. అటు ఉక్రెయిన్‌కు కూడా ఇదే సంఖ్యలో సైనికులను కోల్పోయినట్లు అంచనా వేశారు. అంతేకాకుండా మరో 40వేల మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోగా.. 1.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది వలస వెళ్లినట్లు చెప్పారు.
ఈ యుద్ధంలో సుమారు 87వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సైనిక విభాగం కూడా ఇటీవలే పేర్కొంది. ఇలా సైనిక మరణాలే ఈ స్థాయిలో ఉంటే తీవ్ర గాయాలపాలైన వారి సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తొలి రెండు నెలల్లోనే రష్యా వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా. ఇటువంటి సమయంలో ఇరు దేశాలకు సైనిక విజయం సాధ్యం కాదని.. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేందుకు అవకాశాలు ఉన్నాయని అమెరికా జనరల్ మార్క్ మిల్లే అభిప్రాయపడ్డారు.
మరిన్ని రోజులు ప్రతికూల పరిస్థితులు
రష్యా చేస్తోన్న భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌కు అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పవర్ గ్రిడ్ పూర్తిగా దెబ్బతినడంతో చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. దీంతో తీవ్ర చలి నుంచి రక్షించుకోవడం ఇబ్బందిగా మారింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మరోవారంపాటు కొనసాగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించినా రష్యా సేనలను తమ సైన్యం దీటుగా తిప్పికొడుతోందని ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం