Russia-Ukraine: రష్యా తన బలగాలను వెనక్కి తీసుకోవాలి: బ్రిటన్‌

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడి చేసి తమ భూభాగంలో కలిపేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లక్షలాది సైనికులను సరిహద్దు వద్ద మోహరించింది. ఉక్రెయిన్‌పై దాడి చేయొద్దని ఇప్పటికే అమెరికా రష్యాను హెచ్చరించింది. తాజా

Published : 11 Feb 2022 01:31 IST

మాస్కో: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడి చేసి తమ భూభాగంలో కలిపేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లక్షలాది సైనికులను సరిహద్దు వద్ద మోహరించింది. ఉక్రెయిన్‌పై దాడి చేయొద్దని ఇప్పటికే అమెరికా రష్యాను హెచ్చరించింది. తాజాగా బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గాలంటే.. సరిహద్దుల్లోని సైన్యాన్ని రష్యా ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడం కోసం బ్రిటన్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిటీష్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌ రష్యా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ విదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ట్రస్‌ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడి చేసే యోచన లేదని రష్యా విదేశాంగ మంత్రి తనకు చెప్పారని వెల్లడించారు. కానీ, మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో మోహరించిన సైన్యాన్ని వెంటనే అక్కడి నుంచి మరో చోటుకి తరలించి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలని ట్రస్‌ రష్యాను కోరారు. కాగా.. ఈ భేటీ తనను నిరుత్సాహపర్చిందని లావ్రోవ్‌ తెలిపారు. తమ దేశాధ్యక్షుడు ఈ విషయంపై వివరణ ఇచ్చినా దాన్ని ఇతర దేశాధినేతలు, అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని