USA: అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

USA: అమెరికాలో ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో కాల్పులు జరిపిన నిందితుణ్ని పోలీసులు రోమియో నాన్స్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

Updated : 23 Jan 2024 13:37 IST

వాషింగ్టన్‌: అమెరికాలో (USA) మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో జోలియెట్‌ పట్టణంలో ఆది, సోమవారాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుణ్ని రోమియో నాన్స్‌గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్‌ ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని