Turkey: వక్రబుద్ధి మార్చుకోని తుర్కియే.. మళ్లీ ఐరాసలో కశ్మీర్‌పై ఎర్డొగాన్‌ వ్యాఖ్యలు

తుర్కియే(టర్కీ) అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ మరో సారి భారత్‌పై వక్రబుద్ధిని బయటపెట్టుకొన్నారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. భారత్‌-పాక్‌ మధ్య ఇప్పటి వరకు శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు

Updated : 21 Sep 2022 13:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  తుర్కియే(టర్కీ) అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ మరో సారి భారత్‌పై వక్రబుద్ధిని బయటపెట్టుకొన్నారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. భారత్‌-పాక్‌ మధ్య ఇప్పటి వరకు శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌లకు 75 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం లభించింది. ఇప్పటికీ  రెండు దేశాల మధ్య శాంతి, ఐకమత్యం లేదు. ఇది దురదృష్టకరం. కశ్మీర్‌లో శాశ్వత శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ అధ్యక్షుడు  నేర్చుకోవాలని హితవు పలికింది. 

దాదాపు వారం రోజుల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో భేటీ అయ్యారు. వీరిద్దరూ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ-ఎర్డొగాన్‌లు ద్వైపాక్షిక అంశాలు, సహకారం వంటి వాటిపై చర్చించారు.

ఎర్డొగాన్‌ కశ్మీర్‌ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2020లో కూడా పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో కూడా మాట్లాడారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విదేశీయులతో టర్కీ వాసులు జరిపిన పోరాటంతో కశ్మీర్‌ పరిస్థితిని పోల్చారు. 2019లో ఎర్డొగాన్‌ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని