US: అమ్మా.. అని దీనంగా కేకలేసినా..! కనికరించని పోలీసులు
29 ఏళ్ల వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించిన ఘటనపై అమెరికా(US)లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా విడుదలయ్యాయి.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా(US)లో పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. కొద్దిరోజుల క్రితం వారు ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు మృతి చెందాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను అధికారిక వర్గాలు విడుదల చేయగా.. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
మృతుడు పేరు టైర్ నికోల్స్(Tyre Nichols). ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడ్‌ఎక్స్‌లో పనిచేసేవాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో ఈ నెలలో అతడిని పోలీసులు ఆపినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా వీడియోలను బట్టి.. మెంఫిస్ నగర పోలీసులు (Memphis police) ఎందుకు ఆపారో మాత్రం వెల్లడికాలేదు. తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ.. పోలీసులు అతడిని వాహనంలో నుంచి నేలపైకి లాగారు. నికోల్స్ చేతులు విరగ్గొట్టమని ఒక పోలీసు ఆదేశించడం వినిపిస్తోంది. అతడు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ షాకిచ్చే వెపన్ ఉపయోగించారు. పోలీసులు ఎలాంటి కనికరం లేకుండా చాలాసేపు అతడిని కొట్టారు. అతడు బాధతో విలవిలలాడుతూ అమ్మా.. అమ్మా అంటూ కేకలు వేయడం ఆ వీడియోల్లో వినిపిస్తోంది. జనవరి ఏడున ఈ ఘటన జరగ్గా.. చికిత్స పొందుతూ నికోల్స్ 10వ తేదీన మృతి చెందాడు.
దీనిపై అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియో ఫుటేజ్ తప్పక ప్రజల్ని ఆగ్రహానికి గురిచేస్తుంది’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.
మృతుడు, ఆ మెంఫిస్ నగర పోలీసులు(Memphis police) అంతా నల్లజాతీయులే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిపై హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్‌కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు..
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్‌పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్‌లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్‌లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్‌లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్‌లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్‌పుర్ తల్లీకొడుకులు
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి