Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని ఇంట దీపావళి సంబరాలు

బ్రిటన్‌లో అప్పుడే దీపావళి (Diwali) సంబరాలు షురూ అయ్యాయి. ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) స్థానిక హిందువులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. 

Updated : 09 Nov 2023 13:45 IST

లండన్‌: విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలుపెట్టారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అక్కడి హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్‌ తన నివాసం 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో హిందువులకు ఆతిథ్యమిచ్చారు. వారితో కలిని దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది. దీనిలో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఆ లెక్కలేవీ నాకు తెలియదు

ఇదిలా ఉండగా.. ఇటీవల రిషి సునాక్‌ భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతిని కూడా సమీక్షించారు. అంతేకాకుండా, ప్రపంచ కప్‌లో టీమ్‌ ఇండియా సాధిస్తున్న విజయాలను సునాక్‌ అభినందించారు.

కమలా హారిస్‌ నివాసంలోనూ వేడుకలు..

అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. దీపాలు వెలిగించిన అనంతరం ఆమె అక్కడికి విచ్చేసిన అతిథులతో మాట్లాడారు. ఈ పండుగ తనకు ఎంతో ముఖ్యమైందని ఆమె అన్నారు. ఇది వెలుగు చీకటి మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా హమాస్‌పై ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న యుద్ధం గురించి ఆమె ప్రస్తావించారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడానికి అమెరికా మద్దతు ఇస్తున్నట్లు హారిస్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని