Kidnap: అన్న ఉండేలు దెబ్బతో.. చెల్లికి విముక్తి!
అమెరికాలోని (USA) మిచిగాన్‌లో (Michigan) 8 ఏళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె సోదరుడు ఉండేలుతో గురిపెట్టి రక్షించాడు.
ఇంటర్నెట్‌డెస్క్: ఎనిమిదేళ్ల తన చెల్లిని ఓ దుండగుడు కిడ్నాప్ (kidnap) చేసేందుకు ప్రయత్నించాడు. కిటికీలోంచి అది చూసిన 13 ఏళ్ల బాలుడు ఎంతో తెలివిగా వ్యవహరించి చెల్లిని దుండగుడి చెర నుంచి కాపాడాడు. తన వద్దనున్న ఉండేలు (క్యాట్రీబాల్)తో కిడ్నాపర్ తల, చాతీపై గురిపెట్టి కొట్టాడు. దీంతో విలవిల్లాడిన అతడు.. చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. అమెరికాలోని మిషిగాన్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్‌పేనా టౌన్‌షిప్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులు బయటకి వెళ్లడంతో ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. పుట్టగొడుగుల కోసం 8 ఏళ్ల చిన్నారి ఇంటి పెరట్లోకి రావడం గమనించిన ఓ దుండగుడు.. నక్కి నక్కి వచ్చి.. ఆమె నోటిని మూసేసి, అక్కడి నుంచి దగ్గర్లోని పొదల్లోకి లాక్కెళ్లిపోయాడు. విడిపించుకునేందుకు ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇదంతా బెడ్‌రూమ్ కిటికీలోంచి చూసిన ఆమె సోదరుడు మెరుపు వేగంతో స్పందించాడు. తన వద్దనున్న ఉండేలుతో దుండగుడి తల, ఛాతీపై గురిపెట్టి కొట్టాడు. అతడు బాధతో విలవిల్లాడుతుండగా.. ఈ లోగా చిన్నారి తప్పించుకొని ఇంట్లోకి వచ్చేసింది.
నిందితుడు అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి ఆతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు అదే టౌన్‌షిప్‌కు చెందిన 17 ఏళ్ల టీనేజర్‌గా తెలుస్తోంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి 1,50,000 డాలర్ల జరిమానా విధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Politics News
Jagan-Chandrababu: నంబూరుకు జగన్.. చంద్రబాబు పర్యటనపై సందిగ్ధత
-
Politics News
KTR: విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి: కేటీఆర్
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?
-
World News
Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్.. ప్రయాణం కూడా సాహసమే!