California Gunman: మాంటేరి పార్క్ హంతకుడి నుంచి తుపాకీ లాక్కొన్న యువకుడు.. వీడియో వైరల్
మాంటెరీ పార్క్లో కాల్పులకు పాల్పడిన వృద్ధుడు మరింత రక్తపాతం సృష్టించకుండా ఓ యువకుడు ధైర్యంగా అడ్డుకొన్నాడు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలోని మాంటెరీ పార్క్లో కాల్పులకు పాల్పడిన వృద్ధుడి నుంచి ఓ యువకుడు ధైర్యంగా ఆటోమేటిక్ గన్ను లాక్కొన్నాడు. దీంతో సదరు వృద్ధుడు మరింత మంది ప్రాణాలను తీయకుండా కాపాడినట్లైంది. దీంతో ఇప్పుడు ఆ యువకుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకొంటున్నారు. ఆ యువకుడి పేరు బ్రాండన్ త్సే. అతడు కుటుంబం అల్హాంబ్రాలో ఓ డ్యాన్స్ హాల్ నిర్వహిస్తుంది. మాంటేరి పార్కులో కాల్పుల ఘటన జరిగిన రోజు అనుమానిత వృద్ధుడు హూ కాన్ ట్రాన్ ఓ తుపాకీతో బ్రాండన్ కంటపడ్డాడు. కొన్ని నిమిషాల ముందే ట్రాన్ మరో హాల్లో 11 మందిని హత్య చేసిన విషయం ఆ యువకుడికి తెలియదు. కానీ, ఆయుధంతో చూడగానే వెంటనే అప్రమత్తమై ట్రాన్ నుంచి గన్ లాగేసుకొన్నాడు.
ఈ క్రమంలో బ్రాండన్, ట్రాన్ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకొంది. దీనిపై ఓ ఆంగ్ల పత్రికతో బ్రాండన్ మాట్లాడుతూ.. ‘‘అతడు నా ముఖంపై దాడి చేశాడు. ముఖ్యంగా తల వెనుక కొట్టాడు. అయినా, అతడికి తుపాకీ అందకుండా దూరంగా ఉంచాను’’ అని వివరించాడు. ఎట్టకేలకు ట్రాన్ నుంచి గన్ స్వాధీనం చేసుకొన్నాడు. దానిని అతడి వైపు గురిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ట్రాన్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించినట్లు బ్రాండన్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్