Published : 17 Jan 2022 01:46 IST

Taliban: ఆగని తాలిబన్ల దుశ్చర్యలు.. సంగీతకారుడిపై కన్నెర్ర!

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత తదితర సమస్యలు వేధిస్తోన్నా, స్థానికంగా హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదికలు వెల్లడిస్తోన్నా.. మరోవైపు తమదైన ఆంక్షల పాలన సాగిస్తున్నారు. తాజాగా స్థానికంగా ఓ సంగీతకారుడికి సంబంధించిన వాయిద్యాన్ని వారు అతని ముందే తగులబెట్టడం చర్చనీయాంశమైంది. ఇక్కడి పక్తియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సంగీతకారుడు ఏడుస్తూ ఉండగా.. తాలిబన్లు అక్కడే  తుపాకులతో నవ్వుతూ నిలబడ్డట్లు కనిపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించింది మొదలు.. కఠిన నియమాలతో పాలన సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల వాహనాల్లో సంగీతం ప్లే చేయడాన్ని కూడా నిషేధించారు. ఇదే కాకుండా వివాహాది వేడుకల్లోనూ లైవ్‌ మ్యూజిక్‌ను బ్యాన్‌ చేశారు. ఈ మేరకు ప్రమోషన్ ఆఫ్‌ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మినిస్ట్రీ మార్గదర్శకాలు జారీ చేస్తోంది.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని