AP News: అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేసిన మున్సిపల్‌ సిబ్బంది

 మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్థరాత్రి మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు. ఈ నెల రెండో తారీకుతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.

Published : 19 Jun 2022 06:48 IST

Tags :

మరిన్ని