Indonesia: ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం

ఇండోనేషియా ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది దుర్మరణం చెందారు. మరో 300 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంకా 11 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమాన జట్టు ఓటమిని తట్టుకోలేని వేలాది మంది ప్రజలు.. మైదానంలోకి దూసుకెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆందోళనలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

Published : 02 Oct 2022 20:19 IST

Tags :

మరిన్ని