ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తాచాటిన భారత ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో.. బంగారు పతకాలతో మెరిసింది. 

Updated : 28 Apr 2024 10:41 IST

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్‌లో జ్యోతిసురేఖ హోరాహోరీగా పోరాడి పసిడిని సాధించింది. ఆదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కలిసి మహిళల టీమ్ ఈవెంట్‌లో 236-225 పాయింట్ల తేడాతో పసిడి పతకం కైవసం చేసుకుంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి.. 158-157 పాయింట్ల తేడాతో గెలిచి పసిడి పతకం సాధించింది. 

Tags :

మరిన్ని