Video Song: త్యాగ స్ఫూర్తిని చాటేలా.. ‘భారత్ మా తుజే సలామ్’ వీడియో సాంగ్‌

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... ‘భారత్ మా తుజే సలామ్’ అనే పాటను అకాడమీ వర్గాలు విడుదల చేశాయి. భారత త్రివిధ దళాలకు శిక్షణ పొందే అభ్యర్థులకు.. అకాడమీ అందించిన సహకారాన్ని వివరించే విధంగా పాటను రూపొందించారు. ఈ పాట సాయుధ దళాలకు దేశం పట్ల అంకితభావం, త్యాగ స్ఫూర్తిని బలపరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ పాటను గాయకుడు సుఖ్ విందర్ సింగ్ పాడినట్లు అధికారులు తెలిపారు. 

Published : 30 May 2023 19:12 IST

మరిన్ని