Thor: మీరాబాయి చానుకు థోర్ స్టార్‌ క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రశంసలు

మార్వెల్ సినిమాల్లో 'థోర్ ' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్.. భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుపై ప్రశంసలు కురిపించారు. కామన్ వెల్త్ క్రీడల వెయిట్  లిఫ్టింగ్‌లో భారత్‌కు మీరాబాయి చాను స్వర్ణం అందించిన నేపథ్యంలో..  థోర్ తన సుత్తిని వదులుకునే సమయం వచ్చిందని మీరాబాయిని ఉద్దేశించి ఓ అభిమాని ట్వీట్ చేశారు. క్రిస్ హెమ్స్ వర్త్ ఆ ట్వీట్‌కు స్పందించారు. థోర్ పాత్ర ధరించే సుత్తిని చేపట్టేందుకు చాను పూర్తి అర్హురాలని ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

Published : 06 Aug 2022 16:36 IST

Tags :

మరిన్ని