Israel: ఆందోళనకారుల ఆకస్మిక నిరసనలతో అట్టుడికిన ఇజ్రాయెల్

ఆందోళనకారుల ఆకస్మిక నిరసనలతో ఇజ్రాయెల్ అట్టుడికింది. న్యాయ సంస్కరణలను ప్రశ్నించిన రక్షణ మంత్రి గాలెంట్‌ను.. ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ తొలగించడం నిరసనలకు దారి తీసింది. అర్ధరాత్రి సమయంలో లక్షలాదిగా ప్రజలు రహదారులపైకి దూసుకొచ్చి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని ఇంటి సమీపంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 27 Mar 2023 12:07 IST

మరిన్ని