Mangalagiri: గందరగోళంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌.. ఉద్యోగులకు తప్పని అవస్థలు!

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ గందరగోళంగా సాగుతోంది. ఎవరి ఓటు ఎక్కడో తెలియక చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

Published : 07 May 2024 15:49 IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ గందరగోళంగా సాగుతోంది. ఎవరి ఓటు ఎక్కడో తెలియక చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఎవరిని అడగాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోలింగ్ అధికారులను అడిగితే వాళ్లు విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఉద్యోగుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారిణి రాజకుమారి చెప్పారు. మొదటి రోజు అందరూ ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. బుధవారం సాయంత్రం వరకు ఎంతమంది ఉన్నా.. అందరూ ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. తెలంగాణ నుంచి బ్యాలెట్ పత్రాలు రాకపోవడంతో అక్కడి అధికారులకు ఇక్కడ ఓటు లేదన్నారు.

Tags :

మరిన్ని