AP News: సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాననే ధోరణి సరికాదు: పి.వి. రమేశ్‌

‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా.. కేసులు పెట్టేస్తాం.. జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం.. గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరగాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం’ అని ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.వి.రమేశ్‌ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో సోమవారం సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

Published : 16 Apr 2024 09:40 IST

Tags :

మరిన్ని