Hyderabad: హైదరాబాద్‌లో జోరు వాన.. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌లో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.

Published : 07 May 2024 19:34 IST

హైదరాబాద్‌లో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్‌, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌, ప్యారడైజ్‌, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరింది. 

Tags :

మరిన్ని