అర్ధరాత్రి విందు కోసం హోటల్ సిబ్బందిపై దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

రాజస్థాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన గొడవతో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అజ్మీర్‌లోని రెస్టారెంట్ సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటనలో ఐఏఎస్ అధికారి గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్‌లపై అశోక్ గహ్లోత్ ప్రభుత్వం వేటు వేసింది. వారితోపాటు ఓ కానిస్టేబుల్, మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపైన క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అజ్మీర్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా  ఐఏఎస్‌ (IAS) అధికారి గిరిధర్, గంగాపుర్ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్‌ (IPS) అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ ఓఎస్‌డీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ చేసుకునే క్రమంలో అధికారులకు, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. కర్రలు, ఇనుపరాడ్లతో రెస్టారెంట్ సిబ్బందిపై పోలీసులు దాడిచేశారు. ఈ ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు వేసింది

Updated : 15 Jun 2023 12:49 IST

Tags :

మరిన్ని