Jammu: భూకంప సమయంలో.. మహిళకు ప్రసవం చేసిన వైద్యులు

భూకంపం సంభవించి భూమి కంపిస్తున్నా.. ఓ మహిళకు వైద్యులు ప్రసవం చేసిన సంఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. మంగళవారం హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం ధాటికి ఉత్తర భారతంలో భూమి కంపించింది. ఈ సమయంలోనే అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్ బెహారా ఆస్పత్రి వైద్యులు.. ఓ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు. విజయవంతంగా మహిళకు ప్రసవం చేసినందుకు జిల్లా వైద్యాధికారి అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సమయంలో చుట్టూ ఉన్న వస్తువులు, వైద్య పరికరాలు కదలడం.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

Published : 22 Mar 2023 18:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు