Vizag Steel Plant: నాకు యాక్టింగ్‌ రాదు.. యాక్షన్‌ వచ్చు..: కేఏ పాల్‌ వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌  (Vizag Steel Plant) ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో కలిసి విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేకరణపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు. వైకాపా నుంచి అంతమంది ఎంపీలున్నా స్టీల్‌ప్లాంట్‌ విషయంలో సీఎం జగన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. తనకు యాక్టింగ్‌రాదని.. యాక్షన్‌ వచ్చంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా పాల్‌ వ్యాఖ్యానించారు. వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 8 వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని.. దీన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరితో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు.

Updated : 19 Apr 2023 19:11 IST

Tags :

మరిన్ని