KTR: 33 జిల్లాల్లో.. వేటిని తొలగిస్తారో చెప్పండి!: కేటీఆర్‌

కేసీఆర్‌ ఏం చేస్తే.. దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Published : 04 May 2024 17:25 IST

కేసీఆర్‌ ఏం చేస్తే.. దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజా ఉద్యమాలతో ఏర్పాటు చేసినట్టు కేటీఆర్‌ చెప్పారు. పార్లమెంటు స్థాయికి ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని వివరించారు. 33 జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారో.. ఏ జిల్లాలను ఉంచుతారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ రెడ్డి తేదీలు మార్చుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

మరిన్ని