Harish Rao: ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం!: హరీశ్ రావు

ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆరింటిలో ఐదు అమలు చేశామని వారు చెప్పినదంతా అబద్ధమని విమర్శించారు.

Updated : 04 May 2024 16:27 IST

ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆరింటిలో ఐదు అమలు చేశామని వారు చెప్పినదంతా అబద్ధమని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీనీ ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా ఆరు గ్యారంటీలు సహా రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని హరీశ్ రావు మరోసారి చెప్పారు.

Tags :

మరిన్ని