Land Titling Act: ప్రజలకు చేటు చేసేలా ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’..!: న్యాయవాది సోము కృష్ణమూర్తి

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’.. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని.. స్వయంగా న్యాయ నిపుణులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం పూర్వాపరాలు ఏంటి? దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? తదితర అంశాలను బెజవాడ బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తి మాటల్లో తెలుసుకుందాం.

Published : 04 May 2024 19:36 IST

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’.. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఈ చట్టం గురించే విస్తృతమైన చర్చ. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని.. స్వయంగా న్యాయ నిపుణులే చెబుతున్నారు. భూ కబ్జాదారులు.. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని, వివాదాలు సృష్టించి రూ.కోట్ల విలువైన ఆస్తులను అవలీలగా కొట్టేసేందుకు వీలుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రోడ్డెక్కినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తు సీఎం జగన్ అబద్ధాలు చెబుతూ.. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని మేధావులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం పూర్వాపరాలు ఏంటి? దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? తదితర అంశాలను బెజవాడ బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తి మాటల్లో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని