పాము భయంతో ఇల్లు కాల్చుకున్న యజమాని

పాము చోరబడడంతో ఇంట్లో నిప్పంటించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో చోటు చేసుకుంది. బడంపేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాము కనపడింది. పామును  చంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విసిగిపోయిన మొగులయ్య.. కారు టైరు కాల్చి పాము ఉన్న స్థలంలో వేశాడు. టైరు కాలే వాసనకు పాము పారిపోతుందని అనుకుంటే మంటలు ఇంటి వాసాలకు అంటుకొని... ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

Published : 03 Oct 2022 19:26 IST

మరిన్ని

ap-districts
ts-districts