ఓటమి భయంతోనే కాంగ్రెస్‌పై కుట్రలు

సార్వత్రిక ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీబ్యాంక్  ఖాతాలను స్తంభింపజేయటం వల్ల రైలు టికెట్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండాపోయిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే కారణాలు వెతుకుతున్నారని భాజపా నేతలు ఎద్దేవా చేశారు.

Published : 22 Mar 2024 10:50 IST

Tags :

మరిన్ని