ఇళయరాజా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం స్టాలిన్

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని టీ నగర్‌లో ఇళయరాజా ఇంటికి వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వివిధ భాషల్లో 1000కిపైగా సినిమాల్లో 7 వేలకుపైగా పాటలను ఇళయరాజా (Ilayaraja) స్వరపర్చారు. ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకుపైగా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఇళయరాజాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Published : 02 Jun 2023 16:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు