Warangal: దొంగల మనసు మారింది.. పోయిన బంగారం తిరిగొచ్చింది!

పక్కా పథకంతో బంగారం చోరీ (Gold theft) చేసిన దొంగలు.. వారం తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నారు. కొట్టేసిన 30 తులాల బంగారంలో.. 27 తులాల్ని బాధితుల ఇంటి ప్రహరీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్న గోపి ఇంట్లో వారం క్రితం చోరీ జరిగింది. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో...  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈలోపే అనూహ్యంగా పోయిన బంగారం దొరికింది. అయితే, పోలీసులు దర్యాప్తు చేసి మిగిలిన 3 తులాల్ని కూడా కనిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నారు.

Published : 30 Mar 2023 17:18 IST

Tags :

మరిన్ని