Viral Video: డ్రైవర్‌కు మూర్ఛ.. విశాఖలో కారు బీభత్సం

విశాఖ (Visakhapatnam)లో ఓ కారు బీభత్సం (car accident) సృష్టించిన ఘటనకు సంబంధించి.. సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డయ్యాయి. పాత గోపాలపట్నానికి చెందిన కారు యజమాని తిరుపతిరావు, ఉదయకిరణ్ మంగళవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం విశాఖ నగరానికి బయలు దేరారు. ఏరియా బీఆర్టీఎస్ రహదారికి రాగానే కారు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో.. బ్రేక్కు బదులుగా ఎక్స్‌లేటర్‌ను నొక్కడంతో కారు అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఆగి ఉన్న సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా.. కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న ఓ కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా పోలీసులు తెలిపారు.

Published : 08 Feb 2023 20:18 IST

Tags :

మరిన్ని