High court: ఫార్మాసిటీ భూసేకరణ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ఫార్మాసిటీ భూసేకరణ తీరును హైకోర్టు (High court) తీవ్రంగా తప్పుపట్టింది. ఐఏఎస్‌లు సహా అధికారులు చట్టాలు, భూసేకరణ ప్రక్రియను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారా లేక, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విధానాలను కాలరాస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని భూసేకరణ నోటిఫికేషన్, పరిహార ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని భూసేకరణ ప్రక్రియ మళ్లీ చేపట్టాలని స్పష్టం చేసింది.

Updated : 05 Aug 2023 13:03 IST

Tags :

మరిన్ని