Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం.. వ్యాపారులతో మాటామంతీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పచ్చళ్లు తయారు చేసే మహిళా కార్మికులతో సమావేశమయ్యారు.

Published : 30 Apr 2024 16:01 IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యమిచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి (Nara Brahmani) చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పచ్చళ్లు తయారు చేసే మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. మహిళలతో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు.     

Tags :

మరిన్ని