YS Sharmila: సీఎం కేసీఆర్‌కు వైఎస్‌ షర్మిల 10 ప్రశ్నలు

భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్‌ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన షర్మిల.. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు షర్మిల 10 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు.

Published : 01 Jun 2023 16:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు