News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (09-08-2022)

Updated : 09 Aug 2022 13:40 IST
1/17
ఆజాదీ కా అమృత మహోత్సవం, వజ్రోత్సవం సందర్భంగా పలు విధాలుగా దేశభక్తిని చాటుకుంటున్నారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆవాలతో పది అడుగుల జెండాను రూపొందించి అభిమానాన్ని ప్రదర్శించాడు. ఆజాదీ కా అమృత మహోత్సవం, వజ్రోత్సవం సందర్భంగా పలు విధాలుగా దేశభక్తిని చాటుకుంటున్నారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆవాలతో పది అడుగుల జెండాను రూపొందించి అభిమానాన్ని ప్రదర్శించాడు.
2/17
వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరిగితే చాలు శంకరపట్నం మండలంలోని అర్కండ్ల వాగు దాటడానికి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులో నీటి ఉద్ధృతి పెరిగింది. అవతలి ఒడ్డుకు కాలి నడకన, ద్విచక్ర వాహనాలతో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాగాల్సిందే. వ్యవసాయ పనులకు గ్రామ సర్పంచి అనితతో పాటు మహిళా కూలీలు ట్రాక్టర్‌లో సోమవారం వాగు దాటుతున్న దృశ్యమిది.  వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరిగితే చాలు శంకరపట్నం మండలంలోని అర్కండ్ల వాగు దాటడానికి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులో నీటి ఉద్ధృతి పెరిగింది. అవతలి ఒడ్డుకు కాలి నడకన, ద్విచక్ర వాహనాలతో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాగాల్సిందే. వ్యవసాయ పనులకు గ్రామ సర్పంచి అనితతో పాటు మహిళా కూలీలు ట్రాక్టర్‌లో సోమవారం వాగు దాటుతున్న దృశ్యమిది.
3/17
కారును చూడగానే ఏ శుభకార్యానికో వెళ్లేందుకు చక్కగా అలంకరించారు అనుకుంటున్నారా..? కాదు ఇది ఓ దొంగది. ఇళ్లలో చోరీ చేస్తూ 2020లో పట్టుబడగా అతడి నుంచి దీన్ని స్వాధీనం చేసుకుని కేపీహెచ్‌బీ ఠాణా ముందు ఉంచారు. రెండున్నరేళ్లుగా అలాగే వదిలేయడంతో గడ్డి మొలిచింది.  

కారును చూడగానే ఏ శుభకార్యానికో వెళ్లేందుకు చక్కగా అలంకరించారు అనుకుంటున్నారా..? కాదు ఇది ఓ దొంగది. ఇళ్లలో చోరీ చేస్తూ 2020లో పట్టుబడగా అతడి నుంచి దీన్ని స్వాధీనం చేసుకుని కేపీహెచ్‌బీ ఠాణా ముందు ఉంచారు. రెండున్నరేళ్లుగా అలాగే వదిలేయడంతో గడ్డి మొలిచింది.
4/17
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన నాలాల నుంచి వరద హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. ఈ క్రమంలో ఆయా కాలువల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా భారీగా కొట్టుకొచ్చి ఇలా ఒడ్డుకు చేరాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన నాలాల నుంచి వరద హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. ఈ క్రమంలో ఆయా కాలువల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా భారీగా కొట్టుకొచ్చి ఇలా ఒడ్డుకు చేరాయి.
5/17
మురుగు శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక వ్యర్థ జలం గండిపేటలోకి చేరుతోంది. చిల్కూరు గ్రామ మురుగు వర్షం పడితే సమీపంలోని జలాశయంలో కలుస్తోంది. మురుగు శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక వ్యర్థ జలం గండిపేటలోకి చేరుతోంది. చిల్కూరు గ్రామ మురుగు వర్షం పడితే సమీపంలోని జలాశయంలో కలుస్తోంది.
6/17
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయాలతోపాటు కూడళ్లు మువ్వన్నెల రంగులతో ముచ్చట గొలుపుతున్నాయి. వెలుగులీనుతున్న చార్మినార్, నానాల్‌నగర్‌ కూడలి చిత్రాలివి.


స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయాలతోపాటు కూడళ్లు మువ్వన్నెల రంగులతో ముచ్చట గొలుపుతున్నాయి. వెలుగులీనుతున్న చార్మినార్, నానాల్‌నగర్‌ కూడలి చిత్రాలివి.
7/17
8/17
విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో స్పెన్సర్స్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ దీపాలు పట్టు తప్పాయి. గాలికి అటు.. ఇటూ ఊగుతుండటంతో ఎవరిపై పడతాయోనని అటుగా వచ్చేవారు హడలిపోతున్నారు. విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో స్పెన్సర్స్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ దీపాలు పట్టు తప్పాయి. గాలికి అటు.. ఇటూ ఊగుతుండటంతో ఎవరిపై పడతాయోనని అటుగా వచ్చేవారు హడలిపోతున్నారు.
9/17
10/17
విశాఖ నగరం తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రోజు కూలీలు పని దొరక్క ఇంటిబాట పట్టారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారంతా జల్లుల్లోనే వెళ్లాల్సి వచ్చింది.       విశాఖ నగరం తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రోజు కూలీలు పని దొరక్క ఇంటిబాట పట్టారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారంతా జల్లుల్లోనే వెళ్లాల్సి వచ్చింది.
11/17
12/17
విశాఖ ఆర్కేబీచ్‌ ఆల్‌ఎబిలిటీస్‌ పార్కు పక్కన కొబ్బరి తోటల్లో ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. అక్కడే మద్యం తాగి పెద్ద సంఖ్యలో సీసాలను పారేస్తున్నారు. సీసాలను పగలగొట్టి సాగరంలోకి విసురుతున్నారు. ఒక్కోసారి ఆ గాజు ముక్కలు గుచ్చుకొని పలువురు గాయపడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరున్న ఇక్కడ ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిత్యం పారిశుద్ధ్య కార్మికులు ఆ మద్యం సీసాలను ఏరి సంచుల్లో పెట్టి(చిత్రంలో) తరలిస్తున్నారు. విశాఖ ఆర్కేబీచ్‌ ఆల్‌ఎబిలిటీస్‌ పార్కు పక్కన కొబ్బరి తోటల్లో ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. అక్కడే మద్యం తాగి పెద్ద సంఖ్యలో సీసాలను పారేస్తున్నారు. సీసాలను పగలగొట్టి సాగరంలోకి విసురుతున్నారు. ఒక్కోసారి ఆ గాజు ముక్కలు గుచ్చుకొని పలువురు గాయపడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా పేరున్న ఇక్కడ ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిత్యం పారిశుద్ధ్య కార్మికులు ఆ మద్యం సీసాలను ఏరి సంచుల్లో పెట్టి(చిత్రంలో) తరలిస్తున్నారు.
13/17
 జమ్ములో సోమవారం నిర్వహించిన తిరంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది


జమ్ములో సోమవారం నిర్వహించిన తిరంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది
14/17
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా లాంక్‌షైర్‌లో చిన్నారితో ముచ్చటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా లాంక్‌షైర్‌లో చిన్నారితో ముచ్చటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌
15/17
ఎగువనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల (గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.45 టీఎంసీల)కు చేరింది. జలాశయం పూర్తిగా నిండడంతో స్పిల్‌ వే గుండా అలుగు పారుతున్న దృశ్యం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.       

ఎగువనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల (గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.45 టీఎంసీల)కు చేరింది. జలాశయం పూర్తిగా నిండడంతో స్పిల్‌ వే గుండా అలుగు పారుతున్న దృశ్యం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.
16/17
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీపీ భర్త రాంబాబు సభా వేదికపై అధికారులతోపాటు కూర్చున్నారు. ఆయనే స్వయంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బందితో సమీక్షించారు. ఎలాంటి అధికారిక హోదా లేని రాంబాబు సమావేశంలో ఎలా పాల్గొన్నారు? అధికారులెలా అనుమతించారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి.  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీపీ భర్త రాంబాబు సభా వేదికపై అధికారులతోపాటు కూర్చున్నారు. ఆయనే స్వయంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బందితో సమీక్షించారు. ఎలాంటి అధికారిక హోదా లేని రాంబాబు సమావేశంలో ఎలా పాల్గొన్నారు? అధికారులెలా అనుమతించారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి.
17/17
మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా అని  తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు విన్నవించింది.  మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. చిన్న పాకలో ఉంటున్నా.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా అని తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు విన్నవించింది.

మరిన్ని