News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (28-11-2022)

Updated : 28 Nov 2022 22:20 IST
1/20
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా అడెల్లిలోని మహా పోచమ్మ ఆలయంలో పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా అడెల్లిలోని మహా పోచమ్మ ఆలయంలో పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.
2/20
అడెల్లి గ్రామంలో భాజపా కార్యకర్త రాజశేఖర్‌ గౌడ్‌ ఇంట్లో బండి సంజయ్‌ టీ తాగారు. అనంతరం రాజశేఖర్‌ గౌడ్‌, అమూల్య దంపతుల కుమార్తెకు నక్షత్ర అని ఆయన నామకరణం చేశారు. అడెల్లి గ్రామంలో భాజపా కార్యకర్త రాజశేఖర్‌ గౌడ్‌ ఇంట్లో బండి సంజయ్‌ టీ తాగారు. అనంతరం రాజశేఖర్‌ గౌడ్‌, అమూల్య దంపతుల కుమార్తెకు నక్షత్ర అని ఆయన నామకరణం చేశారు.
3/20
ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గడ్‌ నుంచి కోరాపుట్‌ వెళ్లే రైల్వే మార్గంలో ఎత్తైన కొండల మీది నుంచి పంటపొలాలు ఇలా అందంగా కనిపించాయి. ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గడ్‌ నుంచి కోరాపుట్‌ వెళ్లే రైల్వే మార్గంలో ఎత్తైన కొండల మీది నుంచి పంటపొలాలు ఇలా అందంగా కనిపించాయి.
4/20
డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ సిబ్బంది రిహార్సల్స్‌ చేశారు. ఇందులో భాగంగా హెలికాప్టర్లు, నౌకలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ సిబ్బంది రిహార్సల్స్‌ చేశారు. ఇందులో భాగంగా హెలికాప్టర్లు, నౌకలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
5/20
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సాయంకాల వేళ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు బంగారు వర్ణంలో మెరిశాయి. ఆ నీటిలో పక్షులు ఎగురుతున్న చిత్రం చూడచక్కగా కనిపించింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సాయంకాల వేళ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు బంగారు వర్ణంలో మెరిశాయి. ఆ నీటిలో పక్షులు ఎగురుతున్న చిత్రం చూడచక్కగా కనిపించింది.
6/20
గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు చిరంజీవి ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. సరైన సమయంలో ఈ పురస్కారం  పొందడం ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు. గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు చిరంజీవి ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. సరైన సమయంలో ఈ పురస్కారం పొందడం ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు.
7/20
8/20
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గవిమఠం గొర్రెలు, మేకల మార్కెట్‌లో ఓ వింత మేక కనిపించింది. వెలిగొండ గ్రామానికి చెందిన చెన్నకేశవులు తన గొర్రెలు, మేకలను సంతలో అమ్మడానికి పెట్టగా పొట్టలో కొమ్ము ఉన్న మేక కనిపించింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు ఆసక్తిగా గమనించారు. ఈ విషయమై పశుసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్‌ను వివరణ కోరగా.. జన్యుపరమైన లోపాలతో ఇలాంటివి జరుగుతాయని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గవిమఠం గొర్రెలు, మేకల మార్కెట్‌లో ఓ వింత మేక కనిపించింది. వెలిగొండ గ్రామానికి చెందిన చెన్నకేశవులు తన గొర్రెలు, మేకలను సంతలో అమ్మడానికి పెట్టగా పొట్టలో కొమ్ము ఉన్న మేక కనిపించింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు ఆసక్తిగా గమనించారు. ఈ విషయమై పశుసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్‌ను వివరణ కోరగా.. జన్యుపరమైన లోపాలతో ఇలాంటివి జరుగుతాయని చెప్పారు.
9/20
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ‘హను-మాన్‌’ సినిమా హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్‌వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘హను-మాన్’ టీజర్‌ బాగుందని కిషన్‌రెడ్డి వారికి కితాబిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ‘హను-మాన్‌’ సినిమా హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్‌వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘హను-మాన్’ టీజర్‌ బాగుందని కిషన్‌రెడ్డి వారికి కితాబిచ్చారు.
10/20
నల్గొండ జిల్లా దామరచర్లలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, దయాకర్‌రావు తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.
11/20
తిరుచానూరు పద్మావతి ఆలయంలో పంచమితీర్థం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. తిరుచానూరు పద్మావతి ఆలయంలో పంచమితీర్థం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు.
12/20
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇండోర్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైకిల్‌ తొక్కి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇండోర్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైకిల్‌ తొక్కి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
13/20
రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 38వ రోజు ఈ సినిమా కలెక్షన్లు.. అక్కడ విడుదలైన రోజు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మరోవైపు ఈ సినిమా 34రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లో చేరింది. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 38వ రోజు ఈ సినిమా కలెక్షన్లు.. అక్కడ విడుదలైన రోజు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మరోవైపు ఈ సినిమా 34రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లో చేరింది.
14/20
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న చిన్న విమానం ఆదివారం సాయంత్రం అమెరికాలోని మాంట్‌గోమరి గ్రామంలో ప్రమాదానికి గురై నేరుగా ఇలా విద్యుత్తు తీగల లైన్‌లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న చిన్న విమానం ఆదివారం సాయంత్రం అమెరికాలోని మాంట్‌గోమరి గ్రామంలో ప్రమాదానికి గురై నేరుగా ఇలా విద్యుత్తు తీగల లైన్‌లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు.
15/20
వెనెజువెలాలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కారకస్‌లో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేందుకు పెద్ద ఎత్తున జంటలు తరలివచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చాయి. వెనెజువెలాలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కారకస్‌లో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేందుకు పెద్ద ఎత్తున జంటలు తరలివచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చాయి.
16/20
ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.	ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
17/20
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన నేడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచి తితిదే అధికారులు, అర్చకులు పద్మావతి అమ్మవారికి సారె తీసుకొచ్చి సమర్పించారు.	తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన నేడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచి తితిదే అధికారులు, అర్చకులు పద్మావతి అమ్మవారికి సారె తీసుకొచ్చి సమర్పించారు.
18/20
అగ్రకథానాయకుడు రజనీకాంత్ నటించిన బాబా సినిమాను డిసెంబర్‌ 12న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలైంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆసక్తిగా లేకపోవడంతో అప్పట్లో ఈ సినిమా ఫలితం నిరాశ పర్చింది. దీంతో తాజాగా కొన్ని సన్నివేశాలు జోడించినట్లు సమాచారం. వాటికి రజనీ డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.	అగ్రకథానాయకుడు రజనీకాంత్ నటించిన బాబా సినిమాను డిసెంబర్‌ 12న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలైంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆసక్తిగా లేకపోవడంతో అప్పట్లో ఈ సినిమా ఫలితం నిరాశ పర్చింది. దీంతో తాజాగా కొన్ని సన్నివేశాలు జోడించినట్లు సమాచారం. వాటికి రజనీ డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
19/20
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు.	హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు.
20/20
మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, ఎంపీలు మార్గాని భరత్, విజయసాయిరెడ్డి	మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, ఎంపీలు మార్గాని భరత్, విజయసాయిరెడ్డి

మరిన్ని