News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (31-05-2023)

Updated : 31 May 2023 12:25 IST
1/19
మెదక్‌లోని ఏ ప్రాంతంలో చూసినా  రేలా పూలు  పసుపు పచ్చగా చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఇప్ప చెట్లు ఎర్రని రంగులో కనిపించడంతోపాటు రకరకాల పూలు అడవులకు కొత్త అందాలు తెచ్చిపెట్టాయి. మెదక్‌లోని ఏ ప్రాంతంలో చూసినా రేలా పూలు పసుపు పచ్చగా చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఇప్ప చెట్లు ఎర్రని రంగులో కనిపించడంతోపాటు రకరకాల పూలు అడవులకు కొత్త అందాలు తెచ్చిపెట్టాయి.
2/19
మైదానాలు అందుబాటులో లేకపోవడంతో క్రికెట్ ఆడేందుకు వ్యవసాయ భూములను ఎంచుకున్నారు బాలలు. రోజంతా క్రికెట్‌ ఆడి ‘పరుగుల’ పంట పండించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చాప్లాతండాలో కనిపించిన దృశ్యమిది. మైదానాలు అందుబాటులో లేకపోవడంతో క్రికెట్ ఆడేందుకు వ్యవసాయ భూములను ఎంచుకున్నారు బాలలు. రోజంతా క్రికెట్‌ ఆడి ‘పరుగుల’ పంట పండించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చాప్లాతండాలో కనిపించిన దృశ్యమిది.
3/19
హనుమకొండ రోడ్డు వైపు ప్రిస్టన్‌ ఎదురుగా ప్రధాన రహదారి పక్కగా విద్యుత్‌ హైటెన్షన్‌ 11కేవీ తీగలు ఒకవైపు, లోటెన్షన్‌ తీగల లైన్‌ మరో వైపు ఏర్పాటు చేశారు. అయితే హెచ్‌టీ, ఎల్‌టీ రెండు లైన్ల మధ్య తాటిచెట్లు ఉండటంతో గాలిదుమారం వచ్చిన ప్రతిసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పట్టణ ప్రజలు తెలిపారు. హనుమకొండ రోడ్డు వైపు ప్రిస్టన్‌ ఎదురుగా ప్రధాన రహదారి పక్కగా విద్యుత్‌ హైటెన్షన్‌ 11కేవీ తీగలు ఒకవైపు, లోటెన్షన్‌ తీగల లైన్‌ మరో వైపు ఏర్పాటు చేశారు. అయితే హెచ్‌టీ, ఎల్‌టీ రెండు లైన్ల మధ్య తాటిచెట్లు ఉండటంతో గాలిదుమారం వచ్చిన ప్రతిసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పట్టణ ప్రజలు తెలిపారు.
4/19
 కదంబ వృక్షం కాయలను పూలదండ మాదిరి మధ్యలో ఆకులతో గుచ్చి ఇదిగో ఇలా ఆకర్షణీయంగా రూపొందించి అదే చెట్టుకు తగిలించారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం శాయన్నరావుపాలెంలో రావు జోగేశ్వరరావు ఇంటివద్ద చెట్టుకు కనిపించింది. కదంబ వృక్షం కాయలను పూలదండ మాదిరి మధ్యలో ఆకులతో గుచ్చి ఇదిగో ఇలా ఆకర్షణీయంగా రూపొందించి అదే చెట్టుకు తగిలించారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం శాయన్నరావుపాలెంలో రావు జోగేశ్వరరావు ఇంటివద్ద చెట్టుకు కనిపించింది.
5/19
ఆదిలాబాద్‌ జిల్లాలోని సాయినగర్‌ నుంచి బోథ్‌కు వెళుతున్న ఆటోట్రాలీలో పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పట్టు తప్పితే ప్రమాదం బారిన పడే అవకాశముంది. ట్రాలీ ఆటో పైభాగంలో కొందరు కూర్చొని, వెనక కాళ్లను బయటపెట్టి ఊగిసలాడుతూ కొంత  మంది ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని సాయినగర్‌ నుంచి బోథ్‌కు వెళుతున్న ఆటోట్రాలీలో పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పట్టు తప్పితే ప్రమాదం బారిన పడే అవకాశముంది. ట్రాలీ ఆటో పైభాగంలో కొందరు కూర్చొని, వెనక కాళ్లను బయటపెట్టి ఊగిసలాడుతూ కొంత మంది ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
6/19
 దేశంలో, రాష్ట్రంలో జనాభా ఎంత అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. విశాఖపట్నంలోని ఏయూ ఆవరణలో జనాభా పరిశోధనా కేంద్రం వద్ద ఇటీవల ‘డిజిటల్‌ జన గణన గడియారం’ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి పది సెకన్లకో సారి గణాంకాలు నవీకరణ అవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 

7/19
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో, మంథని పట్టణంలోని తమ్మ చెరువులో కలువలు విరబూశాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కట్టపైకి వ్యాయామం, ఆహ్లాదం కోసం వచ్చే వారిని ఆకట్టుకుంటున్నాయి. 

8/19
హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కామర్స్‌ బోధించే అధ్యాపకుడు చింతల శైలేందర్‌ ద్విచక్రవాహనాన్ని ప్రచార రథంగా మార్చారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో చేరి నాణ్యమైన విద్యను పొందాలని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

9/19
 నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామ శివారులో ఓ తొండ మిషన్‌ భగీరథ వాల్వు నుంచి వృథాగా పోతున్న జల్లులలో తడుస్తూ కనిపించింది. వాల్వు నుంచి ఎగసి పడుతున్న నీటి చుక్కలతో చాలాసేపు అక్కడే సేదతీరింది.

10/19
 నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పానగల్‌ చౌరస్తా వర్షం నీటితో నిండి కొలనును తలపించింది.నిలిచిన నీటిలో నుంచి ద్విచక్ర వాహనం వెళ్తున్న చిత్రాన్ని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది.

11/19
 హైదరాబాద్‌లోని  కాముని చెరువు నుంచి భారీగా వచ్చిన రసాయన వ్యర్థాల నురగ నాలాలో నిల్వ ఉండటంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. అడ్డుగా పెట్టిన ఇనుప కంచెలు సైతం తుప్పు పడుతున్నాయి. పక్కనే పశువుల పాక ఉండటంతో వాటికి ప్రాణగండం ఉంది.

12/19
హైదరాబాద్‌లోని  మూసాపేటలోని గూడ్స్‌ షెడ్‌ ఇది. గోదాములు చాలావరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలకు సరఫరా చేసేందుకు ఎలాంటి సరకు లేకపోవడంతో దాదాపు వెయ్యి మంది కూలీలు పనిలేక కాలక్షేపం చేస్తున్నారు. లారీలు పార్కింగ్‌ చేసి కనిపించాయి.

13/19
హైదరాబాద్‌లోని  బాలానగర్‌ నైపర్‌ వద్ద పాదచారులు దాటడానికి సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు రోడ్డ్డు దాటే వీల్లేకుండా కొందరు వాహనదారులు అపసవ్య దిశలో వస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.

14/19
దాదాపు 25 రోజులుగా మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్, మాదారం, ప్రతాప్‌సింగారంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకొంటూ.. అమ్మేందుకు పడిగాపులు పడుతున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

15/19
 రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమానికి మంగళవారం  హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పోలీసులు రిహార్సల్స్‌ నిర్వహించారు.

16/19
పక్షులను బోనులో బంధించకండి.. వాటిని స్వేచ్ఛగా ఎగరనీయాలంటూ పెటా సంస్థ వినూత్న పద్ధతిలో ప్రచారం చేపట్టింది. మంగళవారం  హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పెటా సభ్యురాలు ప్రియాంక మెహర్‌ పక్షి ఆకారంలో వస్త్రధారణతో పంజరంలో ఉండి ప్రజలకు అవగాహన కల్పించారు.

17/19
కనులకింపుగా ఆకుపచ్చగా మైదానం భలేగుందనిపిస్తోంది కదూ.. నిజమేమిటంటే. హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్ప్రైజ్(ఐపీఈ) మైదానంలో ఏర్పాటుచేసిన కృత్రిమ పచ్చిక ఇది. 

18/19
దిల్లీలో మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమైన కంబోడియా రాజు నరోదమ్‌ శిహమోని

19/19
సముద్రం సాధారణంగా నీలివర్ణంలో ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో ఒక్కోసారి లేత, ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. మంగళవారం దీనికి భిన్నంగా ఏపీలోని కాకినాడ తీరం నుంచి ఉప్పాడ వరకు సముద్రంలో రెండు వర్ణాలు కనిపించాయి.	

Tags :

మరిన్ని