చూపు మెరుగైతే జ్ఞాపకశక్తి!

కంట్లో శుక్లాలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే సరిచేసుకోవటం మంచిది. దీంతో చూపు మెరుగవటమే కాదు.. తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా ముప్పు సైతం తగ్గుతుంది! శుక్లాలు లేదా నీటికాసుల్లో ఏదో ఒక సమస్య ఉండి,

Published : 01 Mar 2022 00:39 IST

కంట్లో శుక్లాలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే సరిచేసుకోవటం మంచిది. దీంతో చూపు మెరుగవటమే కాదు.. తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా ముప్పు సైతం తగ్గుతుంది! శుక్లాలు లేదా నీటికాసుల్లో ఏదో ఒక సమస్య ఉండి, డిమెన్షియా లేని 3వేల మంది వృద్ధులను 24 ఏళ్ల పాటు పరిశీలించి మరీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. శుక్లాల శస్త్రచికిత్స చేయించుకోనివారితో పోలిస్తే.. దీన్ని చేయించుకున్నవారికి మతిమరుపు ముప్పు 24% తక్కువగా ఉంటున్నట్టు తేలింది. నీటికాసుల విషయంలో శస్త్రచికిత్స చేయించుకున్నా, చేయించుకోకపోయినా ఎలాంటి తేడా కనిపించలేదు. ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. శుక్లాల తొలగింపు జ్ఞాపకశక్తిని కచ్చితంగా రక్షిస్తుందని ఇందులో రుజువేమీ కాలేదు. అయితేనేం? చూపు తగ్గటం వంటి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమస్యలతో నలుగురితో కలవటం, మెదడుకు ప్రేరణ తగ్గుతాయి. ఇవి డిమెన్షియాకు దారితీసే ప్రమాదముందని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే పేర్కొంటున్నాయి. చూపు తగ్గటం వల్ల వ్యాయామం  చేయటమూ తగ్గుతుంది. పనులూ సరిగా చేయలేరు. ఇది కూడా డిమెన్షియాకు కారణమయ్యేదే. కాబట్టి శుక్లాలతో చూపు తగ్గినవారు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవటం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని