గూగుల్ మెచ్చిన బుడత!
వయసు కేవలం పది సంవత్సరాలు... చదువుతోందేమో నాలుగో తరగతి... కానీ ఏకంగా గూగుల్‌ను మెప్పించాడు... పోటీలో గెలిచాడు.. వార్తల్లో నిలిచాడు... ఇంతకీ ఏంటా పోటీ.. ఎవరా బుడత? తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.
కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇటీవల గూగుల్.. బాలల దినోత్సవం సందర్భంగా డూడుల్ పోటీ నిర్వహించింది. ఇందులో భారతదేశ వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే దాదాపు 1,15,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతమందిలో మన శ్లోక్ ముఖర్జీ విజేతగా నిలిచాడు.
రానున్న 25 ఏళ్లలో...
‘రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఎలా ఉండనుంది?’ అనే కాన్సెప్ట్ మీద గూగుల్ ఈ డూడుల్ పోటీలు నిర్వహించింది. ఇందులో శ్లోక్ ముఖర్జీ రానున్న 25 ఏళ్లలో శాస్త్రవేత్తలు మనుషులకు ఉపయోగపడేలా ఎకోఫ్రెండ్లీ రోబో తయారు చేయనున్నారు. భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయాణాలు పెరుగుతాయి. మన దేశం యోగా, ఆయుర్వేదంలో మరింత మెరుగు కానుందనే అర్థం వచ్చేలా డూడుల్ తయారు చేశాడు. ఇది మన శ్లోక్‌ను విజేతగా నిలిపింది.
స్కాలర్‌షిప్ కైవసం...
డూడుల్ పోటీలో నెగ్గిన మన శ్లోక్ అయిదు లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే రెండు లక్షల రూపాయల టెక్నాలజీ ప్యాకేజీని కూడా పొందాడు. శ్లోక్ చదువుకునే స్కూల్లో చిత్రలేఖనంలో చక్కగా శిక్షణ ఇచ్చారు కాబట్టే... తాను డూడుల్ పోటీలో నెగ్గగలిగాడు. అలాగే శ్లోక్ వాళ్ల అంకుల్ కూడా చిత్రకారుడే. ఆయన కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. తాను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పేరు సంపాదిస్తానని చెబుతున్నాడు. మరి మనమూ మనసారా శ్లోక్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదామా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి