ధన్య అదరహో..!

హాయ్‌ నేస్తాలూ..! ఇప్పుడిప్పుడే స్కూల్‌కి వెళ్లే పిల్లలు అంటే.. చిన్నచిన్న రైమ్స్‌, ఏబీసీడీలు, అఆలు నేర్చుకుంటూ ఉంటారు. వారికి అవి తప్ప మిగతా సబ్జెక్టులేవీ తెలియవు.. అంతే కదా! కానీ ఓ నేస్తం మాత్రం ఏకంగా ‘పిరియాడిక్‌ టేబుల్‌’లో ఉండే పేర్లను అలవోకగా చెప్పేస్తుంది.

Updated : 02 Dec 2023 05:34 IST

హాయ్‌ నేస్తాలూ..! ఇప్పుడిప్పుడే స్కూల్‌కి వెళ్లే పిల్లలు అంటే.. చిన్నచిన్న రైమ్స్‌, ఏబీసీడీలు, అఆలు నేర్చుకుంటూ ఉంటారు. వారికి అవి తప్ప మిగతా సబ్జెక్టులేవీ తెలియవు.. అంతే కదా! కానీ ఓ నేస్తం మాత్రం ఏకంగా ‘పిరియాడిక్‌ టేబుల్‌’లో ఉండే పేర్లను అలవోకగా చెప్పేస్తుంది. అంతే కాకుండా ఇతర అంశాల్లో కూడా తన ప్రతిభను చాటుకుంటుంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మిళనాడులోని తంజావురుకు చెందిన వి.ఎం.ధన్యశ్రీకి అయిదు సంవత్సరాలు. ప్రస్తుతం ఎల్కేజీ చదువుతుంది. ఆ వయసులో పిల్లలు సాధారణంగా అయితే స్కూల్లో నేర్చుకున్న రైమ్స్‌ ఒకటీ, రెండింటినే పూర్తిగా చెప్పలేక, తడబడతూ ఉంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రసాయనశాస్త్రంలో ఉండే పిరియాడిక్‌ టేబుల్‌లోని పేర్లను గబగబా చెప్పేస్తుంది.

శ్లోకాలూ చెబుతుంది..!

మన ధన్యలో అదొక్కటే కాకుండా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి నేస్తాలూ..! తనకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైన విషయాన్ని ఒకసారి చెబితే ఇట్టే గుర్తుపెట్టుకుంటుంది. తను మన రాష్ట్రాల, ఇతర దేశాల రాజధానుల పేర్లు, రకరకాల శ్లోకాలు తడుముకోకుండా చెప్పేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. వివిధ సంస్థలకు సంబంధించిన లోగోలను, జాతీయ నాయకుల ఫొటోలను కూడా గుర్తుపట్టేస్తుంది’ అని ధన్య వాళ్ల నాన్న చెబుతున్నారు.

అమ్మ ప్రోత్సాహంతోనే..

ఈ చిన్నారిలో ఉన్న ప్రతిభను ముందుగా వాళ్లమ్మే గమనించారట. అప్పటి నుంచి తన ఆసక్తినిబట్టి ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ వచ్చారు. ధన్య కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుందట. తన ప్రతిభకు మెచ్చిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘వన్స్‌ ఇన్‌ ఎ మిలియన్‌’ అవార్డును అందించారు. ఎంతైనా మన ధన్య చాలా గ్రేట్‌ కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని