సోదరీ‘మణులు’... ప్రతిభలో ఘనులు!
వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు... ప్రతిభలో ఒకరికి మించి మరొకరు! నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడతారు. కుంచె పడితే చాలు, చక్కని చిత్రాలు జాలువారతాయి.. వాటిలో జీవం ఉట్టిపడుతుంది. చూసేవారి కళ్లను కట్టిపడేస్తాయి. చెల్లి అయితే రోబోలకూ ప్రాణం పోస్తోంది! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి!
ఈ అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉంటున్నారు. వీరిలో అక్క పేరు రంగ సంజన. ఈ చిన్నారి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. చెల్లెలి పేరు రంగ శాన్విక. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. నాన్నపేరు రంగ నవీన్ కుమార్. అమ్మ వెబ్ డిజైనర్‌గా స్థిరపడ్డారు. నాన్న ఐఐటీ ప్రొఫెసర్‌గా చేసేవారు. కొంతకాలం క్రితం చనిపోయారు. ప్రస్తుతం వీళ్ల ఆలనాపాలనా అమ్మే చూసుకుంటున్నారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో ఈ బుడతలు తమ ప్రతిభను చాటుతున్నారు.
కుంచె పడితే...
సంజనకు చిన్నప్పటి నుంచే చిత్రకళ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్‌లో చూసి చిత్రాలు గీయడం నేర్చుకుంది. చిన్నారి ఇష్టాన్ని గమనించిన అమ్మానాన్న శిక్షణ సైతం ఇప్పించారు. ఉపాధ్యాయులు కూడా సంజనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. పాఠశాలలోనూ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించి చేయూతనిచ్చారు. ఆగస్టు 15, 2021 నుంచి 2022 వరకు సంజన దాదాపు 75 చిత్రాలను వేసింది. ఇందులో మండాల పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్స్, కలర్ పెన్సిల్ డ్రాయింగ్స్, వాటర్ కలర్ పెయింట్స్, అక్రిలిక్ పెయింటింగ్స్ ఇలా రకారకాల రీతుల్లో, భిన్న మెటీరియల్స్‌తో వేసిన చిత్రాలున్నాయి. ఇటీవల తన ప్రతిభను గుర్తించిన ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు అతి చిన్న వయసులో ఒక సంవత్సరంలో 75 పెయింటింగ్స్ వేసినందుకుగాను వారి పదో వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాన్ని అందించారు. ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం కల్పించారు.
చిన్నారి ‘చిట్టి’ చెల్లి..
శాన్వికకు చిత్రలేఖనంతోపాటు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ సహకారం, ప్రోత్సాహంతో కొన్ని సైన్స్ ప్రాజెక్టులను చేసింది. ఇందులో చిట్టి చిట్టి రోబోలూ ఉన్నాయి. ఓ రోజు ఇందులో ఓ ప్రాజెక్ట్‌ను తన క్లాస్ టీచర్ అర్చనకు చూపించింది. వాటి గురించి వివరించింది. ఉపాధ్యాయురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తనను ఎంతో ప్రోత్సహించారు. ప్రతివారం ఓ సైన్స్ ప్రాజెక్ట్‌ను తయారు చేసి, దాన్ని స్కూల్లో ప్రదర్శించమని సూచించారు. టీచర్ చెప్పినట్లే ప్రాజెక్టులు సిద్ధం చేసింది ఈ చిన్నారి. శాన్విక పట్టుదలకు ముగ్ధులైన మిగతా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్ కూడా ఎంతో ప్రోత్సహించారు.
రోబోలే రోబోలు!
ఈ ప్రయత్నంలో భాగంగా శాన్విక ఎలక్ట్రిసిటీ కండెక్టర్, వాక్యూమ్ క్లీనర్, రోబోకారు, డ్రాయింగ్ రోబో, వాకింగ్ టార్టాయిస్, మెటల్ డిటెక్టర్, విండ్ పవర్, ఫ్రీ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేసింది. అంతేకాదు ఈ కొత్త సంవత్సరంలో దాదాపు 100 ప్రాజెక్టులు చేయాలని ఆశయంగా పెట్టుకుంది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ప్రాజెక్టులు చేసిన శాన్విక ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది.
ఇలా చిన్న వయసులోనే చిత్రకళ, సైన్స్ ప్రాజెక్టుల్లో దూసుకుపోతున్న ఈ అక్కాచెల్లెళ్లు భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా. ఇంకెందుకాలస్యం... సంజన, శాన్వికకు ఆల్‌ది బెస్ట్ చెప్పేయండి మరి.
బుజ్జి పిచ్చుక... బుల్లి పిచ్చుక!
సంజన, శాన్విక గత సంవత్సరం ‘సేవ్ స్పారో’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చిత్రలేఖన పోటీల్లోనూ పాల్గొన్నారు. ఇందులో పిచ్చుకల గొప్పతనం, ప్రకృతి సమతుల్యంలో పిచ్చుకల పాత్ర, వాటిని సంరక్షించాల్సిన అవసరం గురించి చెప్పే ప్రయత్నం చేసింది శాన్విక. ఎందరినో ఆలోచింపజేసిన ఈ చిత్రం బహుమతిని సొంతం చేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!