రూ.45 లక్షలలోపు ఇళ్లకే డిమాండ్‌

కొవిడ్‌ సంక్షోభంలోనూ అందుబాటు ఇళ్ల గిరాకీ తగ్గలేదు. రూ.45 లక్షలలోపు ఇళ్లను అందుబాటు ఇళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే.....

Updated : 01 May 2021 05:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ సంక్షోభంలోనూ అందుబాటు ఇళ్ల గిరాకీ తగ్గలేదు. రూ.45 లక్షలలోపు ఇళ్లను అందుబాటు ఇళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటానే 45 శాతంగా ఉంది. హైదరాబాద్‌తో సహా దేశంలో 8 ప్రధాన నగరాల్లో ఇదే ప్రతిబింబించిందని ప్రాప్‌టైగర్‌ తాజా త్రైమాసిక సర్వేలో వెల్లడించింది. ధరల్లో 1-3 శాతం పెరిగాయని తెలిపింది.
* 8 నగరాల్లో జనవరి-మార్చి విక్రయాలు క్రితం ఏడాది విక్రయాలకు చేరువగా ఉన్నాయి. 5 శాతం విక్రయాలు తక్కువగా నమోదయ్యాయి.  
* దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో విక్రయాలు పెరగ్గా ముంబయి, పుణే, బెంగళూరులో తగ్గాయి.
* రూ.45లక్షల ధరల లోపున్న 2 పడకల ఫ్లాట్ల విక్రయాలు 45శాతంగా ఉన్నాయి. రూ.45 లక్షలు-రూ.75 లక్షల మధ్యలో ఇళ్ల విక్రయాల వాటా 26శాతంగా ఉండగా రూ.75లక్షలు-రూ.కోటి ఇళ్లవాటా 10శాతం, రూ.కోటిపైన ప్రీమియం ఇళ్లవాటా 19 శాతంగా ఉంది.
* హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మిగతా నగరాలకు భిన్నంగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 5శాతం వృద్ధి నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని