Published : 25 Jun 2022 02:33 IST

సొంతింటి కల సాకారమయ్యేలా

నేడు, రేపు ‘ఈనాడు’ ప్రాపర్టీ షో

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ ఒకేచోట

ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌

ళ్లు, స్థలాలు కొందామని చూస్తుండగానే ధరలు పెరిగిపోతున్నాయి. కొవిడ్‌తో అవి తగ్గుతాయని ఎదురు చూసిన వారికి నిరాశ మిగిలింది. ఇప్పటికీ ఎక్కడ కొనాలో తేల్చుకోలేక.. తమ బడ్జెట్‌లో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకునేందుకు సమయం లేక చాలామంది వాయిదా వేస్తుంటారు. స్థిరాస్తుల సమస్త సమాచారం ఒకేచోట దొరికితే.. చాలావరకు శ్రమ తగ్గినట్లే. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఈనాడు’ ప్రాపర్టీ షో-2022ను ఏర్పాటు చేసింది.  ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ తమ స్టాల్స్‌ను  ఇందులో ఏర్పాటు చేశాయి. మీ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం. మరెందుకు ఆలస్యం. కేపీహెచ్‌బీలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున కల్యాణ మండపంలో శనివారం నుంచి ప్రారంభం అయ్యే రెండు రోజుల ప్రదర్శనకు విచ్చేయండి.  

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో.. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయాల్లో కొన్నాళ్లు స్తబ్దత ఏర్పడినా అనంతరం స్థిరాస్తుల ధరలు వేగంగా దూసుకెళ్లాయి. బడ్జెట్‌లో ఇంటి కోసం వెతుకులాట మొదలెట్టినప్పటి నుంచి క్రమంగా ధరలు పెరుగుతున్న అనుభవమే తప్ప ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదని కొనుగోలుదారులు అంటున్నారు. మరింత ఆలస్యం చేయడం మంచిది కాదనే అభిప్రాయానికి వస్తున్నారు.

మొదట బడ్జెట్‌..

ఇప్పుడు కాకపోతే మున్ముందు మరింత కష్టమనే అభిప్రాయం కొనుగోలుదారుల్లో ఉంది. కాబట్టి కొనాలనే ఆలోచనలో ఉన్నవారు మొదట ఎంత బడ్జెట్‌ వరకు అనేది నిర్ణయించుకోవాలి. ప్రాపర్టీ షో సందర్శనతో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల ధరలు ఎంత ఉన్నాయి? ఎక్కడైతే తమ బడ్జెట్‌లో వస్తుందని బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చే  ఆదాయం ఎంత? గృహ రుణం ఎంత వరకు వస్తుందనే విషయాలను సైతం తెలుసుకోవచ్చు.

ఎంపికకు అవకాశాలు..

ఫ్లాట్ల నుంచి ప్లాట్ల వరకు.. విల్లాలు మొదలు స్థలాల దాకా...నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేపడుతున్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల సమస్త సమాచారం ఒకేచోట కొనుగోలుదారులు తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉంది. బడ్జెట్‌ హోమ్స్‌ నుంచి ప్రీమియం ప్రాజెక్టుల వరకు, పిల్లలు, పెద్దలను దృష్టిలో పెట్టుకుని కడుతున్న ఆవాసాలు, పర్యావరణహితంగా నిర్మిస్తున్న గృహాల వరకు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నచ్చినవాటిని ఎంపిక చేసుకోవచ్చు.


పాల్గొనే సంస్థలివే..

వాసవి గ్రూప్‌, ప్రణీత్‌ గ్రూప్‌, రైసినియా బిల్డర్స్‌, వజ్ర నిర్మాణ్‌, సాకేత్‌ ఇంజినీర్స్‌, ఫార్చున్‌ బట్టర్‌ఫ్లై సిటీ, సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, మోడీ బిల్డర్స్‌, ఎన్‌సీసీ అర్బన్‌ ఇన్‌ఫ్రా, ముప్పు ప్రాజెక్ట్స్‌, హస్తినా రియాల్టీ, హెచ్‌పీఆర్‌ హోమ్స్‌, వర్టెక్స్‌ హోమ్స్‌, విశాల్‌ ప్రాజెక్ట్స్‌, స్వాతి ప్రమోటర్స్‌, కపిల్‌ ప్రాపర్టీస్‌, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌, వర్చూస లైఫ్‌ స్పేసెస్‌, ఏపీఆర్‌ గ్రూప్‌, బెస్ట్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ఆర్‌ గ్రీన్‌ షీల్డ్స్‌ సంస్థలు ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి.

ఎప్పుడు: శని, ఆదివారాల్లో

సమయం: ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు

ఎక్కడ: కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున కల్యాణమండపం

ప్రవేశం: ఉచితం


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts