రబ్డీ క్యారెట్ హల్వా
కావాల్సినవి: క్యారెట్- కేజీ, చక్కెర- మూడు కప్పులు, నెయ్యి- మూడు పెద్ద చెంచాలు, కండెన్స్డ్ మిల్క్- సగం టిన్, చిక్కటి పాలు- లీటరు, యాలకుల పొడి- చెంచాన్నర, చెర్రీలు, డ్రైఫ్రూట్స్- కొన్ని (అలంకరణకు).
తయారీ: క్యారెట్‌ను శుభ్రంగా కడిగి, ఆరిన తర్వాత పొట్టు తీసి సన్నగా తురమాలి. పొయ్యి మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి పాలు పోసి వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు క్యారెట్ తురుము వేసి పాలు సగమయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడ్డాక నెయ్యి, చక్కెర వేసి మరో పది నిమిషాలు కలుపుతూ ఉండాలి. పదార్థం నుంచి నెయ్యి పైకి తేలే వరకు చిన్నమంటపై మగ్గించాలి. పొయ్యి కట్టేసి క్యారెట్ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ సమయంలో రబ్డీని తయారు చేసుకోవాలి. సాధారణంగా రబ్డీని పాలను మరిగించి తయారు చేస్తారు. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా సులువుగా చేసుకునేందుకు కండెన్స్ మిల్క్‌ను వాడుకోవచ్చు.
గిన్నెలో పంచదార, కండెన్స్డ్ పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై మరిగించాలి. యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి రబ్డీని చల్లార్చాలి. ప్లేట్లో క్యారెట్ హల్వా తీసుకుని రబ్డీ, డ్రైఫ్రూట్స్, చెర్రీలతో అలంకరించుకుంటే తియ్యటి క్యారెట్ రబ్డీ హల్వా రెడీ. దీన్ని వేడి వేడిగా లేదా చల్లచల్లగా ఎలాగైనా తినొచ్చు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీ నకిలీ వీడియో..! భాజపా ఎంపీలపై కేసు
-
India News
Vaccination: కరోనా టీకా పంపిణీలో కీలక మైలురాయి..!
-
Sports News
IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
-
India News
Mehbooba: ఆ క్రెడిట్ అంతా సీబీఐ, ఈడీలకే దక్కుతుంది: ముఫ్తీ
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
India News
Presidential Election: ‘రబ్బరు స్టాంపు’గా ఉండబోనని ప్రతిజ్ఞ చేయాలి: యశ్వంత్ సిన్హా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు