పాస్తా మసాలా టేస్టీగా ఉండాలంటే..
మా ఇంట్లో అందరికీ పాస్తా మసాలా అంటే చాలా ఇష్టం. కానీ నేను చేసింది నచ్చడం లేదు. హోటల్ స్టైల్లో చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కాస్త చెప్పండి!
మా ఇంట్లో అందరికీ పాస్తా మసాలా అంటే చాలా ఇష్టం. కానీ నేను చేసింది నచ్చడం లేదు. హోటల్ స్టైల్లో చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కాస్త చెప్పండి!
ముందుగా పాస్తాను ఉడికించాలి. అందులో చెంచాడు నూనె వేస్తే.. అతుక్కోకుండా ఉంటాయి.
- ఇందుకోసం మార్కెట్లో దొరికే ఏ రకం పాస్తానైనా వాడుకోవచ్చు.
- మాక్రోనీ తీసుకుంటే 80% మాత్రమే ఉడికించి చల్లార్చుకోండి. మిగిలిన 20% మసాలాతో పాటు ఉడుకుతుంది.
- కాప్సికం, స్వీట్ కార్న్, మష్రూమ్స్.. ఇలా మీకు నచ్చిన ఏ రంగు కూరగాయలైనా వాడుకోవచ్చు. పనీర్ కూడా వేసుకోవచ్చు. తాజాగా ఉన్న పచ్చి బఠాణీలు వాడేట్లయితే ఉల్లిపాయ మగ్గాక వేయాలి.
- సాస్‌లు లేకుండా రుచిగా చేసుకోవచ్చు. టొమాటోలు వాడితే గనుక.. టొమాటో సాస్ వేయనవసరం లేదు.
- టొమాటోలు అందుబాటులో లేకుంటే టొమాటో కెచప్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్ ఉపయోగించవచ్చు.
- పాస్తా రుచి పెంచేది చీజ్. కనుక మొత్తం ఉడికిందనుకున్నాక.. చీజ్ తురుము వేయాలి.
- పాస్తాను దించే ముందు కొద్దిగా నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు వేస్తే సరిపోతుంది. పాస్తా చల్లబడితే రుచి తగ్గిపోతుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే వడ్డించుకుని తినాలి.
పవన్ సిరిగిరి, చెఫ్, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
-
New Words: ఫిన్స్టా.. గర్ల్‌బాస్.. షెఫ్స్ కిస్.. ‘జెనరేషన్ జడ్’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!