మొహబ్బత్‌ కా షర్బత్‌

మండే ఎండల్లో చలచల్లని షర్బత్‌ అలా గొంతులోంచి జారుతుంటే... ఎంత బాగుంటుందో కదా. స్వర్గం కొన్ని అడుగుల దూరంలో కాదు... అంగుళాల దూరంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఇప్పటివరకూ ఎన్నో రకాల షర్బత్‌లను

Updated : 15 Jun 2021 12:47 IST

పొరుగు రుచి

మండే ఎండల్లో చలచల్లని షర్బత్‌ అలా గొంతులోంచి జారుతుంటే... ఎంత బాగుంటుందో కదా. స్వర్గం కొన్ని అడుగుల దూరంలో కాదు... అంగుళాల దూరంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఇప్పటివరకూ ఎన్నో రకాల షర్బత్‌లను తాగే ఉంటారు. కానీ దీన్ని రుచి చూస్తే మాత్రం దిల్లీవాసుల్లా మీరూ వదిలిపెట్టరు. పాలల్లో కాస్త గులాబీసిరప్‌, ఐస్‌, పుచ్చకాయ ముక్కలు, పంచదార కలిపి దీన్ని తయారు చేస్తారు. తెలుపు, గులాబీ రంగుల సమ్మేళనంతో చూడచక్కగా కనిపించే ఈ షర్బత్‌ దిల్లీవాసుల హృదయాలనూ గెలుచుకుంది. అందుకే దీన్ని ‘ప్యార్‌’, ‘మొహబ్బత్‌ కా షర్బత్‌’ అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని