కూతురి సమాధిపైన క్యూఆర్‌ కోడ్‌!

రెజీ మినీలకి ఒక్కతే కూతురు. పేరు అఖిల. ఉత్సాహమే ఊపిరిగా ఉండేది. ఆటాపాటలతో అలరించేది. అలాంటమ్మాయికి 2022 డిసెంబర్‌లో తీవ్ర జ్వరం వచ్చింది.

Published : 11 Feb 2024 00:14 IST

రెజీ మినీలకి ఒక్కతే కూతురు. పేరు అఖిల. ఉత్సాహమే ఊపిరిగా ఉండేది. ఆటాపాటలతో అలరించేది. అలాంటమ్మాయికి 2022 డిసెంబర్‌లో తీవ్ర జ్వరం వచ్చింది. చూస్తుండగానే అది ఆ అమ్మాయి ప్రాణం తీసింది. కూతురిని కళ్ళెదుటే మృత్యువు కబళించడాన్ని చూసి కుప్పకూలిపోయిన ఆ తల్లిదండ్రుల్ని- అఖిల స్నేహితులే ఓదార్చారు. సోషల్‌ మీడియాలో అఖిల పేల్చిన జోకులూ, సరదా వీడియోలూ, విజయాలనీ ఆ తల్లిదండ్రులతో పంచుకునేవాళ్ళు. వీళ్ళేమో అఖిల చిన్ననాటి ముచ్చట్లూ, ఫొటోలని వీళ్ళకి చూపిస్తుండేవారు. అప్పుడే ఆ అమ్మాయికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటితో ఓ వెబ్‌సైట్‌ సృష్టించారు ఆ తల్లిదండ్రులు. దానికి ఓ క్యూఆర్‌ కోడ్‌ని సృష్టించి- అఖిల సమాధిపైన దాన్ని ఉంచాలనుకున్నారు. కేరళ కొల్లంలోని వలియాపల్లి అనే గ్రామంలో ఉంటారీ దంపతులు. అక్కడి సిరియన్‌ కేథలిక్‌ చర్చి ఆచారం ప్రకారం సమాధిపైన పేరు జననమరణ వివరాలు తప్ప ఇంకేమీ రాయకూడదు. కానీ ఈ తల్లిదండ్రుల దైన్యం చూసి- కేరళలోనే తొలిసారి అందుకు అనుమతినిచ్చారు. దాంతో ఇటీవలే అఖిల సమాధిపైన ‘క్యూఆర్‌ కోడ్‌’ని ఉంచారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..