weekly horoscope: గ్రహబలం (డిసెంబరు 24 - 30)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 24 Dec 2023 01:03 IST


సకాలంలో పనులు పూర్తిచేయడం ద్వారా ఉద్యోగంలో ప్రశంసలందుకుంటారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. ఖర్చు తగ్గించాలి. మంచి భవిష్యత్తుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.


ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహబలం తక్కువగా ఉంది. తొందర పడవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సహనంతో లక్ష్యాన్ని పూర్తిచేయాలి. నిరుత్సాహ పరిచేవారు ఉంటారు. ఎవరి మాటలూ మనసుకు తీసుకోవద్దు. లోతుగా ఆలోచించ వద్దు. వ్యాపారంలో నష్టాలను నివారించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.


గ్రహబలంలో మార్పులేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి, మేలు కలుగుతుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పోయినవి తిరిగి లభిస్తాయి. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


అదృష్టవంతులవుతారు. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభాలున్నాయి. ఇష్టదేవతను స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.


ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేకమార్గాల్లో లాభపడతారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, శుభం కలుగుతుంది.


వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. అభీష్టం సిద్ధిస్తుంది. ఆపద నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబసభ్యుల సలహా తీసుకోవాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. శివనామస్మరణ శక్తినిస్తుంది.


ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. స్థిరత్వం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార యోగముంది. సాహసో పేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. దేనికీ వెనకడుగు వేయవద్దు. వ్యాపారంలో కలిసివస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఖర్చులు తగ్గించాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


ఆర్థికంగా బలపడతారు. ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విజయం సిద్ధించేవరకూ కృషి కొనసాగించాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆపదలు తొలగుతాయి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవారున్నారు. శాంతంగా సంభాషించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.


అదృష్టకాలం కొనసాగుతోంది. సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధి పొందుతారు. ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు. తగిన గుర్తింపూ ప్రతిఫలమూ లభిస్తాయి. భవిష్యత్‌ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. సొంత నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.


గ్రహబలం తగ్గింది, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యంపై దృష్టి నిలపాలి. మిత్రుల సూచనలు తోడ్పడతాయి. పనులు వాయిదా వేయవద్దు. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో కలిసివస్తుంది. ఉపయోగ కరమైన పనులు చేసి ప్రశంసలు అందు కుంటారు. అధికారయోగం సూచితం. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ధనయోగముంది. దశదిశలా విస్తరిస్తారు. నూతనప్రయత్నాలు ఫలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి. ఇష్టదేవతను స్మరించండి, మేలు జరుగుతుంది.


శ్రేయస్సు పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పేరు ప్రతిష్ఠలు పొందుతారు. మీ సత్ప్రవర్తన నలుగురికీ ఆదర్శమవుతుంది. సహాయ గుణంతో ముందుకు సాగండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించండి, శుభవార్తలు వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..