Weekly horoscope: రాశిఫలం (జూన్‌ 11 - 17)

ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే...

Updated : 11 Jun 2023 06:17 IST


వ్యాపార యోగం బాగుంది. నూతనప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టసిద్ధి ఉంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరతారు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. మానసికంగా ఇబ్బంది పెట్టేవారున్నారు. నిరాశ చెందవద్దు. సూర్యధ్యానం శుభప్రదం.


ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. ప్రశాంతంగా పనులు ప్రారంభించి ఉత్సాహంగా ముందుకు సాగండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. గతాన్ని గుర్తుచేసుకుని ఇబ్బంది పడవద్దు. నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. శాంతంగా సంభాషించాలి. ప్రారంభించిన పని పూర్తయ్యేవరకూ ఆపవద్దు. వ్యాపారంలో జాగ్రత్త. విష్ణు సహస్రనామం చదువుకోండి, శుభవార్త వింటారు.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. నిర్ణయాల్లో స్పష్టత ఉండాలి. చంచలత్వం వల్ల సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఇబ్బందులనుంచి బయటపడతారు. ప్రతిపనీ కుటుంబ సభ్యులకు చెప్పి చేయాలి. ఇష్టదేవతను స్మరించండి, కార్యసిద్ధి లభిస్తుంది.


ఉద్యోగయోగం బ్రహ్మాండంగా ఉంది. విశేషమైన అభివృద్ధి లభిస్తుంది. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారం బాగుంటుంది. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విమర్శల్ని మనసుకి తీసుకోవద్దు. పట్టువిడుపులు అవసరం. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. ఈశ్వరారాధన శుభప్రదం.


శుభకాలం నడుస్తోంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పని అవుతుంది. న్యాయపరమైన లాభం ఉంది. సమయం వృథా చేసుకోవద్దు. వ్యాపారంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.


ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. దేనికీ భయపడవద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. కొన్ని విషయాల్లో స్పష్టత ఉండదు, ఆత్మీయులతో చర్చించి పనిచేయండి. వ్యాపారంలో జాగ్రత్త. విష్ణుసహస్రనామం చదువుకోండి, శుభవార్త వింటారు.


సత్సంకల్పంతో పని ప్రారంభించండి, విజయం లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో ఏకాగ్రత పెంచాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. బాధ్యతాయుతంగా నడచుకోవాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అడుగడుగునా విఘ్నాలు ఉంటాయి. మంచి భవిష్యత్తుకై వేచిచూడండి. రుణసమస్యలు రానివ్వవద్దు. అపార్థాలకు తావివ్వకండి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


కాలం మిశ్రమంగా ఉంది. పనుల్ని సకాలంలో ప్రారంభించి ఏకాగ్రతతో పూర్తిచేయాలి. ఆర్థికంగా కలసివస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ముందస్తు ప్రణాళికలతో నష్టనివారణ సాధ్యం. ధర్మమార్గంలో చేసే పనులకు ఆటంకాలు ఉండవు. ఓర్పుతో ముందుకెళ్లాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మనోబలం పెరుగుతుంది.


బ్రహ్మాండమైన శుభకాలం. ఇంటాబయటా కలిసివస్తుంది. ఏ పని ప్రారంభించినా తేలిగ్గా విజయం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ముఖ్యకార్యాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. గ్రహబలం అనుకూలంగా లేదు. ఏకాగ్రతతో పనులు పూర్తిచేయాలి. శాంతంగా సంభాషించాలి. తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మొహమాటం లేకుండా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


విశేష శుభయోగాలున్నాయి. వ్యాపారం కలిసొస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. భూలాభం సూచితం. నూతన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి. పనులను మధ్యలో ఆపవద్దు. సమయస్ఫూర్తితో ముందుకెళ్లాలి. శుక్రగ్రహ శ్లోకం చదువుకోండి, అదృష్టవంతులు అవుతారు.


ఉద్యోగంలో శుభయోగముంది. ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభాన్నిస్తాయి. అధిక ధనలాభాలున్నాయి. సరైన ప్రణాళికల ద్వారా స్థిరత్వం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహలాభం సూచితం. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..