గొంతెత్తిన ఎలుగు.. వీడియో వైరల్‌

సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రతి విషయంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్పందించడం ఎక్కువైపోయింది. అది మంచైనా..చెడైనా సరే...

Published : 27 Oct 2020 15:30 IST

ట్విటర్‌లో ఉంచిన అమెరికా నేషనల్‌ పార్కు నిర్వాహకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రతి విషయంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్పందించడం ఎక్కువైపోయింది. అది మంచైనా..చెడైనా సరే తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అనువైన వేదికగా నిలుస్తున్నాయి. అమెరికాలోని ఓ జాతీయ పార్కు నిర్వాహకులు ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పార్కులోని ఓ నల్లటి ఎలుగుబంటి చెట్టుపై ఉండి పలు రకాలుగా శబ్దాలను చేస్తుంటుంది. సందర్భానుసారంగా ఎలుగుబంటి చేసే శబ్దాలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరేమో ఎలుగుబంటి ఏదో నొప్పితో బాధపడుతుందని, అందుకే అది అలా అరుస్తోందని వాపోయారు. ఎలుగుబంటి తన భావాలను అద్భుతంగా చెబుతోందని జాతీయ పార్కు నిర్వాహకులను అభినందిస్తూ మరికొందరు  ట్వీట్లు చేశారు. మరి ఎలుగుబంటి చేసిన వింతైన శబ్దాలను ఓసారి మీరూ వినేయండి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని