వధువును భుజానికెత్తి నది దాటించిన వరుడు
పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య సరదా సంఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వధూవరులను
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య సరదా సంఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వధూవరులను బంధువులు ఆటపట్టిస్తూ నవ్వులు పూయిస్తారు. అయితే బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఓ వరుడు చేసిన పని బంధువుల నవ్వులకు కారణమైంది. కిషన్ గంజ్‌లో ఓ పెళ్లి బృందం పడవలో నది దాటుతూ ఉండగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పడవ ముందుకు కదలలేదు. అందరూ దిగి నడుచు కుంటూ వెళుతుండగా, వధువు ఇబ్బంది పడింది. అది గమనించిన వరుడు ఆమెను ఒక్కసారిగా భుజాలపై మోసుకుంటూ నది దాటించాడు. పెళ్లి కుమారుడి చర్యకు వధువు కాసేపు ఆశ్చర్యపోయినా, సిగ్గు పడుతూనే నది దాటింది. ఈ సన్నివేశాన్ని చూసి బంధువులు కాసేపు నవ్వుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్‌తో నగదు దగ్ధం