Viral Video: ప్రారంభించిన కొద్దిసేపటికే బ్రిడ్జి ఎలా తెగిపోయిందో చూశారా?

ప్రారంభించిన కొద్దిసేపటికే ఓ వంతెన తెగిపోయింది. ఈ ప్రమాదంలో నగర మేయర్‌, అతని భార్యతో సహా దాదాపు 20 మంది ఉన్నారు.

Published : 10 Jun 2022 01:42 IST

మెక్సికో: నదిపై కట్టిన కొత్త బ్రిడ్జిపై నడవాలని వారంతా తెగ సంబరపడ్డారు. ప్రారంభానికి ముఖ్య అతిథి కూడా వచ్చారు. అతని వెనుక పర్యాటకులంతా నడవాలని ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. వంతెనను అలా ప్రారంభించి కొద్దిదూరం నడిచారంతా. అంతే.. ఒక్కసారిగా వంతెన తెగిపడి అందరూ పడిపోయారు. ఈ ఘటన మెక్సికో నగరంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

చెక్క బోర్డులు, మెటల్ గొలుసులతో వేలాడే వంతెనను ఇటీవల తిరిగి నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి నగర్‌ మేయర్‌ ఆయన భార్యతో కలిసి వచ్చారు. వంతెనను ప్రారంభించి కొద్దిదూరం అలా నడిచారు. వీరిద్దరితో పాటు మరికొంత మంది కూడా అడుగులు వేశారు. అధికబరువు కారణంగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెన మీద ఉన్న సుమారు 20 మంది 10 అడుగుల లోతులో పడిపోయారు. ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు సిటీ కౌన్సిల్‌ మెంబర్లు కూడా ఉన్నారు. వీరందరినీ సమీప ఆస్పత్రికి తరలించారు. మేయర్‌, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని